శ్రీలంకలో మహిళల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పొట్టకూటి కోసం మహిళలు సెక్స్‌వర్కర్లుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సెక్స్‌వర్కర్లు 30 శాతం పెరిగినట్లు శ్రీలంక మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొందరు మహిళలు తమ బిడ్డలకు తిండి పెట్టేందుకు స్థానిక దుకాణదారులకు ఒళ్లు అప్పగిస్తున్నట్లు వెల్లడైంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోవడంతో ఈ దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి.