ఓ వ్యక్తి ఫోన్ తో కోతులను ఫొటోతీయడానికి ప్రయత్నించగా ఫోన్ కోసం ఎగబడింది ఓ కోతి పిల్ల. తల్లి కోతి వారిస్తున్నఆ కోతి పిల్ల మాత్రం ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ కోతిపిల్ల తల్లి అచ్చం మన అమ్మల్లాగే పిల్లను వెనక్కి లాగుతోంది. దీన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేసాడు. దీంతో చిట్టి కోతి పిల్ల చేష్టలు, తల్లికోతి పెద్దరికం అందరిని ఆకట్టుకుంటుంది.