ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అటల్ పెన్షన్ యోజన పింఛను పథకంలో...ఇక వారికి చోటు ఉండదు

national |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 04:07 PM

అటల్ పెన్షన్ యోజన పింఛను పథకంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అటల్ పెన్షన్ యోజన పింఛను పథకంలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు చేరకుండా నిబంధనల్లో కేంద్ర సర్కారు మార్పులు చేసింది. 2022 అక్టోబర్ 1 నుంచి ఈ నూతన నిబంధన అమల్లోకి రానుంది. పన్ను చెల్లింపుదారులకు అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అర్హత ఉండదు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవేళ అక్టోబర్ 1, ఆ తర్వాత అటల్ పెన్షన్ యోజనలో చేరిన వారికి, పన్ను వర్తించే ఆదాయం ఉందని గుర్తిస్తే.. వారి ఖాతాను మూసేసి, అప్పటి వరకు సమకూరిన మొత్తాన్ని వెనక్కిచ్చేయడం జరుగుతుందని తెలిపింది. 


అటల్ పెన్షన్ యోజనలో ఈ ఏడాది జూన్ 4 నాటికి 3.73 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అటల్ పెన్షన్ యోజన అన్నది అసంఘటిత రంగంలోని వారికి పదవీ విరమణ అనంతరం ప్రతి నెలా పింఛను చెల్లించే పథకం. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు ఎవరైనా చేరొచ్చు. 18-40 ఏళ్ల వరకు చేరేందుకు అనుమతి ఉంటుంది. 60 ఏళ్ల వరకు ప్రతి నెలా కొంత మొత్తం జమ చేయాలి. ఆ తర్వాత నుంచి జీవించి ఉన్నంతకాలం రూ.1,000-5,000 మధ్య పెన్షన్ అందుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com