గుంటూరు జిల్లా ఎస్.పి శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీల తో పాటు విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా పోలీసులు.
ప్రజల భద్రత, భరోసా కల్పిస్తూ నేరపూరిత కార్యక్రమాలు జరగకుండా కట్టడి చేస్తూ ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ అణువణువూ క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు . నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారికి జరిమానా విధించి మరియు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
అదే విధంగా జిల్లా అంతటా LHMS (లాకడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్) గురించి ప్రజలతో అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహించాలని జిల్లా అధికారులకు సూచించారు.