విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాలతో జామి మండలం పీతలవానిపాలెం గ్రామ శివార్లలో ఆగస్టు 10 రాత్రి పేకాట ఆడుతున్న వారిపై జామి ఎస్ఐ శ్రీ వీరబాబు మరియు సిబ్బంది రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 7గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.9,600/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ వారు మాట్లాడుతూ... సమాజంలో సంఘ వ్యతిరేక చర్యలకి పాల్పడితే చట్టం పరిధిలో కఠిన శిక్షలకి అర్హులవుతారు కాబట్టి జీవితాలు నాశనం చేసుకోకుండా మంచి నడవడిక కలిగి జీవించాలని ప్రజలకి సందేశం ఇచ్చారు.