ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలోని విధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది . స్థానిక కోనేరు సెంటర్ నుంచి ఆర్ . అండ్ . బి . గెస్ట్ హౌస్ వద్ద ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వరకు డిగ్రీ కళాశాలల విద్యార్థులు జాతీయ జెండాను ప్రదర్శించారు .
జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . స్వతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుపెట్టుకొని , వారి నుంచి స్ఫూర్తి పొందాలని కలెక్టర్ అన్నారు . ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విద్యార్థులంతా చేపట్టాలన్నారు.
అనంతరం కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు . కలెక్టర్ , జిల్లా ఎస్ . పి . జాషువా ముందుండి ర్యాలీని నడిపించారు . కృష్ణా యూనివెర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ , జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి సీతాపతి తదితరులు పాల్గొన్నారు .
ఆర్ . టీ . సీ . డిపోలో కార్మికులు జాతీయ జెండాపై ప్రదర్శనను ఏర్పాటు చేశారు . స్వాతంత్ర్య సమరయోధుల పోస్టర్లు , జాతీయ నాయకుల ఫోటోలు , జెండాపై చిత్రాలు పెట్టారు .
సమరంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన నాయకులకు ఈ రోజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు . జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల, జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు .
కార్మికశాఖ ఆధ్వర్యంలో స్థానిక కోనేరు సెంటరు నుంచి విద్యార్థులు జాతీయ జెండా చేతబూని స్వాతంత్ర్య సమరయోధుల నినాదాలతో భేల్ కంపెనీ వరకు నడిచారు . ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు కూడా నడిచారు .