అనంతపురం ఎస్పీ ఫకీరప్ప గారు సాంకేతిక పరిజ్ఞానం లో నిష్ణాతులైన అధికారి. తన కెరీర్లోనే ఎన్నో ఆర్థిక నేరాలను, హత్య కేసులను, సైబర్ నేరాలను టవర్ లోకేషన్ల ద్వారా, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అవలీలగా చేదించిన ఆయన నేడు ఒక సాధారణ ఓపెన్ అండ్ షట్ కేసులో నిస్సహాయంగా ఒరిజినల్ వీడియో, ఒరిజినల్ వీడియో అంటూ డర్టీ ఎంపీని తప్పించడానికి ప్రయత్నించడం చూస్తుంటే ప్రభుత్వ పెద్దల చేతిలో కీలుబొమ్మగా మారిపోయారా? లేక ఒత్తిళ్ళకు తలొగ్గారా? అన్న సందేహం కలుగుతుంది అని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సందేహం వ్యక్తపరిచారు.