దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ సెకండ్ సాటర్ డే సెలవును ప్రభుత్వం రద్దు చేసింది.
ఈరోజును పని దినంగా ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల నిర్వహణలో భాగంగా సెమినార్ లు, బృంద చర్చలు, వ్యాస రచన, క్విజ్, నృత్యం, డ్రామా, మ్యూజిక్, పెయింటింగ్, హెరిటేజ్ వాక్, సైకిల్ ర్యాలీస్ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.