బాధితులెవరూ లేని ఘటనపై తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేస్తోందని, ఎంపీ గోరంట్ల మాధవ్ ఇష్యూతో రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మంత్రి ధర్మాన మండిపడ్డారు.
ప్రతిపక్షం అంటే బాధ్యతాయుతంగా నడుచుకోవాలే కానీ గాడి తప్పి, పద్ధతి తప్పి అదే పనిగా అధికార పక్షం ను పదవి నుంచి, రాజ్యాధికారం నుంచి తప్పించాలని అనుకోవడం భావ్యం కాదని అన్నారు. బాధ్యతాయుతం అయిన విపక్షం చేసే పనులు ఇవేనా అని ప్రశ్నించారు.
శ్రీకాకుళం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విపక్ష నేత చంద్రబాబు నాయుడు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ చేస్తున్న వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి ధర్మాన స్పందించారు.