విద్యా విధానంలో గత మూడేళ్లుగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం అని సీఎం జగన్ తెలియజేసారు. విద్యాదీవెన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేవలం ప్రాథమిక విద్యను మాత్రమే కాకుండా పెద్ద చదువులన్నీ కూడా పేదలకు హక్కుగా మారుస్తూ 100శాతం ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నాం.
మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందిని పెద్ద చదువులు చదివిస్తానని సగర్వంగా తెలియజేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జగనన్న విద్యా దీవెన పథకం గడిచిన త్రైమాసికానికి సంబంధించి 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చుతూ రూ.694 కోట్లను విడుదల చేశారు. అంతకుముందు విద్యార్థులు, వారి తల్లులను ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.