రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల గుండెపోటు, రక్తపోటు రెండూ అదుపులో ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు తాగితే అధిక బరువు తగ్గే అవకాశం కూడా ఉంది. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా శరీరానికి చాలా శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కొబ్బరి నీరు బాగా పనిచేస్తుంది. కొబ్బరి నీరు కూడా అధిక వేడిని తగ్గిస్తుంది.