రాయచోటిలోని కొత్తపేట రామాపురంలో దారుణం జరిగింది. అత్త సుబ్బమ్మ కోడలి తల నరికింది. నరికిన తలను ప్లాస్టిక్ కవర్ వేసుకుని పోలీసు స్టేషన్కు వెళ్తుండడం చూసి స్థానికులు భయాందోళన చెందారు. తలను చూసి పోలీసులు షాకయ్యారు. ప్రాథమిక సమాచారం మేరకు.. వసుంధర భర్త, ఆమె సొంత అత్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. దీంతో వసుంధర తన పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది.
భర్త మరణానంతరం ఆస్తులు వసుంధర పేరు మీదకు బదిలీ అయ్యాయి. వసుంధర మరో వ్యక్తితో చనువుగా ఉందని భావించి.. ఆమె తనకు సంక్రమించిన ఆస్తులను సదరు వ్యక్తి పేరు మీదుకు మారుస్తుందేమోనని వసుంధర భర్త తమ్ముడు చందు, ఆమె చిన్నత్త సుబ్బమ్మ కలిసి వసుంధరను హత్య చేయాలని ప్లాన్ చేశారు. గురువారం మధ్యాహ్నం వారు వసుంధర తల నరికి మొండాన్ని వేరు చేశారు. అనంతరం పట్టపగలే సుబ్బమ్మ వసుంధర తలతో పోలీసు స్టేషన్కు వెళ్లడం కలకలం రేపింది. కాగా, ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.