రొళ్ల మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు ఎన్సీవర్గీకరణ కోసం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. స్థానిక డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్లో వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ హసీనాసుల్తానాకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.