పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏ మాత్రం ఆర్థిక భారం కాకూడదు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు పిల్లల చదువులు అడ్డు కాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుకను అమలు చేస్తోందని జెసి సి. ఎం. సాయికాంత్ వర్మ, నగర మేయర్ సురేష్ బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం బాపట్లలో బహిరంగ సభ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా. 2022 ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి సంబంధించి 'జగనన్న విద్యా దీవెన' లబ్ధి మొత్తాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులయిన విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. కార్యక్రమానికి కలెక్టరేట్ విసి హాలు నుండి జెసి, కడప నగర మేయర్, అడా చైర్మన్ గురుమోహన్, హజ్ కమిటీ చైర్మన్ గౌస్‌ఉల్ ఆజం హాజరయ్యారు.