వార్షిక తనిఖీలలో భాగంగా తిమ్మాపురం పొలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించిన జిల్లా SP శ్రీ M. రవీంద్రనాథ్ బాబు IPS. రాఖీ పండుగ సందర్భంగా ఎస్పీ కి రాఖీ కట్టిన సచివాలయ మహిళా పోలీసులు మరియు మహిళా పోలీస్ సిబ్బంది. వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా SP శ్రీ M. రవీంద్రనాథ్ బాబు IPS.,కాకినాడ సబ్ డివిజన్ లో గల తిమ్మాపురం పోలీసు స్టేషన్ నందు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా SP పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి పరిశుభ్రంగా ఉంచవలసినదిగా సూచించడం జరిగింది.
తదుపరి స్టేషన్ నిర్వహణ, రిసెప్షన్ కౌంటర్, కేస్ ప్రాపర్టీ, రిపోర్టు కాబడిన మహిళలకు సంబంధించిన కేసులు, గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులను విశ్లేషించి, పెండింగ్ లో ఉన్నకేసులపై ఆరా తీసి పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన విచారణను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినారు.
ఈ తనిఖీల సందర్భంగా తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది మరియు సచివాల మహిళా పోలీసులు రాఖీ పండుగ సందర్భంగా ఎస్పీ గారికి రాఖీ కట్టి జిల్లాలో మహిళల పట్ల ఎస్పీ గారు తీసుకుంటున్న చర్యలకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.