మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణలో పురోగతి లేదని, నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారని సునీత రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు.