మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికిగల వాటా విక్రయ నిర్వహణను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. హింద్ జింక్‌లో ప్రభుత్వానికి 29.53 శాతం వాటా ఉంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐఐఎఫ్ఎల్, యాక్సిస్, సిటీగ్రూప్ జాబితాలో ఉన్నాయి.ఈ సంస్థలు ఈనెల 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాటా విక్రయ నిర్వహణపై ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.