పిల్లల్లోనూ లాంగ్ కోవిడ్ ముప్పు ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కొందరు పిల్లల్లో వ్యాధి లక్షణాలు తక్కువ తీవ్రతతోనే దీర్ఘకాలం పాటు కొనసాగే ఛాన్సుందని తేలింది. ఆసుపత్రిలో చేరనంత మాత్రాన వారిలో లాంగ్ కోవిడ్ ముప్పు ఉండదనుకోవద్దని పరిశోధకులు సూచించారు. అమెరికాలోని టెక్సాస్‌లో 5-18 ఏళ్లున్న 1,813 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. 4.8% మంది లాంగ్ కోవిడ్‌తో ఇబ్బందిపడినట్లు గుర్తించారు.