చెరుకుపల్లి: మండలంలోని ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఈ పంట నమోదు కార్యక్రమం ప్రారంభించినట్టు మండల వ్యవసాయ శాఖ అధికారి బాలాజీ గంగాధర్ అన్నారు. మండలంలోని రైతులు ఖరీఫ్ సీజన్ లో సాగు చేస్తున్న ప్రతి పంటను రైతు భరోసా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు చేత ఈ పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ పంట నమోదు చేయించుకోకపోతే నష్టపరిహారం, సున్నా వడ్డీ ప్రభుత్వం నుండి వచ్చే ఏ పథకం కూడా వర్తించదని తెలిపారు.