తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో ఓ మహిళా కౌన్సిలర్ భర్త కొడవలితో హల్ చల్ చేశాడు. ఒక వ్యక్తిని వెంబడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెట్రిసెల్వన్ అనే వ్యక్తి గుణశేఖరన్ వద్ద సుమారు రూ.2.60 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు అడగడంతో గుణశేఖరన్ ను వెట్రిసెల్వన్ కొడవలితో వెంబడించాడు. అనంతరం వెట్రిసెల్వన్ ని పోలీసులు అరెస్టు చేశారు.