ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశ్నిస్తే కేసులా... ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 12, 2022, 01:51 PM

ఆగస్ట్ 4వ తేది పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలం , వేపనపల్లి గ్రామంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని ప్రశ్నించిన జేశ్వాంత్ మరియు  9 మంది జనసైనికులపై అక్రమంగా SC/ST అట్రాసిటీ,307 కేసులు పెట్టి రిమాండ్ కు పంపడంపై ఈరోజు చిత్తూరు జిల్లా SP గారిని జనసేన  జిల్లా అధ్యక్షులు Dr.Pasupuleti Hari Prasad , వినుతా కోట ,  జిల్లా లోని ఇంఛార్జిలతో కలిసి వెళ్ళి అక్రమంగా బనాయించిన కేసుల పై విచారణ చేసి విద్యార్థుల భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారుల పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చెయ్యడం జరిగింది. న్యాయం జరగని యెడల రాష్ట్ర స్థాయిలో నిరసన చేస్తామని తెలుపడమైనది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com