పెదకాకాని: అగతవరప్పాడు వాసవి నగర్ లో నివాసముంటున్న కంబాలపాటి వెంకటరావు తన కుటుంబంతో గుంటూరు కొరిటపాడులో నివాసం ఉంటున్న తన కుమార్తె వద్దకు 3రోజుల క్రితం వెళ్లారు. పొరిగింటి వారు ఫోన్ చేసి మీ ఇంటి తాళాలు తెరిచి ఉన్నాయని చెప్పడంతో ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువాలోని రెండు సవర్ల బంగారం, 15 వేల నగదు మాయమైంది. ఈమేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బండారు సురేష్ బాబు తెలిపారు.