ఢిల్లీలో భారీగా వ్యర్థాలు పేరుకుపోయాయి. వీటిని తొలగించాలంటే సుమారు 197ఏళ్ల సమయం పట్టనుందని అధికారులు తెలిపారు. ఢిల్లీ చుట్టుపక్కల మూడు ప్రాంతాల్లో 27.6 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఉన్నాయి. ఈ వ్యర్థాలను తరలించేందుకు రూ.250 కోట్లతో మూడేళ్ల క్రితం ప్రాజెక్టు చేపట్టగా.. ఈ కాలంలో 28 మిలియన్ నుంచి 27.6 మిలియన్ టన్నులకే వ్యర్థాలు తగ్గాయి. ఢిల్లీలో రోజుకి 4,931 టన్నుల వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి.