జగ్గంపేట పోలీసులు తన భర్త శ్రీరామ్‌ను బలవంతంగా తీసుకెళ్లి కొడుతున్నారంటూ..భార్య సురేఖ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ (Habeas Corpus Petition)పై శుక్రవారం ఏపీ హైకోర్టు (AP High court)లో విచారణ జరిగింది. సురేఖ తరపున లాయర్ జడ శ్రవణ్ (Jada sravan)హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా... శ్రీరామ్ తమ కస్టడీలో లేరంటూ కోర్టుకు పోలీసులు తెలిపారు.
సీసీ ఫుటేజ్‌కు సంబంధించిన ఫొటోలను ప్రభుత్వ లాయర్ కోర్టుకు చూపించారు. అయితే తేదీ, సమయం లేకుండా ఫుటేజ్ ఫొటోలను ఎలా నమ్ముతామని లాయర్ శ్రవణ్ ప్రశ్నించారు. తనను పోలీసులు తీసుకెళ్తున్నారని భార్యకు శ్రీరామ్ ఫోన్ చేసిన మొబైల్ స్విచ్చాఫ్‌లో ఉందని హైకోర్టుకు న్యాయవాది తెలిపారు.
ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుందని లాయర్ శ్రవణ్ వాదించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను హైకోర్టు వచ్చే గురువారానికి వాయిదా వేసింది.