ఏపీ సర్కార్ వాణిజ్య భవనాల నిర్మాణానికి ఇంపాక్ట్ ఫీజులను వసూలు చేయనుంది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీలతో పాటు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో 60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న రహదారుల పక్కన కొత్తగా భవనాలు నిర్మించే వారు ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం ఉన్న లైసెన్స్ ఫీజులు, ఇతర ఛార్జీలకు ఇది అదనం. దీనిపై పురపాలకశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.