చిత్తూరు, సత్యవేడు: నియోజకవర్గం నారాయణవనం మండల పరిధిలో చెన్నై-పుత్తూరు జాతీయ రహదారిపై గురువారం ద్విచక్ర వాహనం- ఆటో ఢీకొన్నాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిలో సురేష్ అనే వ్యక్తి కుడికాలు విరిగిపోయింది. గురుమూర్తి తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులు వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపలం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.