చిత్తూరు, వడమాల పేట: సమీపములోని సదాశివకోనలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం విశేష పూజ నిర్వహించారు. సదాశివుడికి అభిషేకం నిర్వహించి పూలమాలలు రుద్రాక్ష మాలలతో అలంకరించారు. కొండకోనల్లో ఉన్న సదాశివుడు దర్శనార్థం భక్తులు సదాశివ కోనకు తరలివచ్చారు. అక్కడ జలపాతంలో స్నానమాచరించి భక్తులు సదాశివుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు స్వామివారికి మంగళహారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.