కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ జంట 3–6, 6–4, 10–8తో టాప్ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)- వెరొనిక కుడెర్మెటొవా (రష్యా) జోడీని ఓడించింది. భారత జోడి తొలి సెట్ కోల్పోయిన తర్వాత రెండు సెట్లలోనూ పైచేయి సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది