నెల్లూరు జిల్లాకు చెందిన సాయిసందీప్(27) ఓ వివాహ వెబ్ సైట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి ప్రొఫైల్ ను చూసి రిక్వెస్ట్ పంపాడు. ఆ యువతితో పరిచయం పెంచుకొని పెళ్లి దాకా తీసుకెళ్లాడు. గురువారం రోజు పెళ్లిపనులు జరుగుతుండగా ఒక్క ఫోన్ కాల్ మండపంలో అలజడి రేపింది. సందీప్ కు వేరే యువతితో సంబంధమున్నట్లు ఫోన్ లో ఓ యువతీ తెలిపింది. ఒక్కసారిగా షాక్ కు గురైన వధువు కుటుంబం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.