ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహనికి ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 4.44లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరోవైపు విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.