సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.
స్కూళ్లకు ఎలాంటి మరమ్మత్తు వచ్చినా వెంటనే బాగు చేసే విధానం ఉండాలన్నారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరినాటికే సిద్ధం చేయాలన్నారు.
8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని, దశలవారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్ సూచించారు.
సీఎం జగన్ విద్యాశాఖపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa