ఎన్ . టి. ఆర్ జిల్లా, పోలీస్ కమిషనరేట్ లో ప్రతి శుక్రవారం జరిగే " డయల్ యువర్ సి.పి " కార్యాక్రమంలో భాగంగా భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్దూ స్కూల్ దగ్గర లోని కృష్ణా నది ఓడున కొంత మంది పాత నేరస్థులు మరియు చెడు నడత కలిగిన వారు రాత్రి సమయంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని మరియు ఆ ప్రాంత ప్రజలను ఇబ్బంది కలిగిస్తున్నారని బాధ్యత గల వ్యక్తి ఫిర్యాదు చేయగా , వెంటనే స్పందించి ఎస్. ఐ స్థాయి అధికారిని సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తూ , బహిరంగంగా మద్యం సేవించే వారి పై చర్యలు తీసుకోవాల్సిందిగా శ్రీమతి పి వెంకటరత్నం డీసీపీ ( క్రైమ్స్ ) సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.