కాకినాడ జిల్లాలో 14, ASR జిల్లాలో 1, అనకాపల్లి జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాలో 2 అనగా మొత్తం 19 గోల్డ్ చైన్ స్నాచింగ్ లు మరియు కాకినాడ జిల్లాలో 8, ASR జిల్లాలో 1 మొత్తం 9 సెల్ ఫోన్ స్నాచింగ్ లు చేసిన దొంగలను కాకినాడ పోలీస్ లు అరెస్ట్ చేసారు.
ఇప్పటికీ 7 గోల్డ్ చైన్ లు, 9 సెల్ ఫోన్లు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్, ఒక బజాజ్ పల్సర్, హీరో గ్లామర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 9 లక్షలు ఉన్నట్లు తెలియజేసారు.
ఇప్పటి వరకు వీళ్ళు చేసిన నేరాలు:
గోల్డ్ చైన్స్ స్నాచింగ్ లు : 19
సెల్ ఫోన్ స్నాచింగ్ లు : 09
మొత్తం 28 స్నాచింగ్ కేసులు. 9 మంది ఓ గ్యాంగ్ గా ఏర్పడి స్నాచింగ్ నేరాలు చేస్తూ వచ్చిన సొమ్ముతో పార్టీలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గ్యాంగ్ లోని సభ్యులు ముందు రెక్కీ చేసి, ఏ ఏరియాలో చేయాలి, తర్వాత ఎలా తప్పించుకోవాలి అని నిర్ణయించుకుని నేరాలు చేస్తూ ఉంటారు. అదుపులోకి తీసుకొని కోర్ట్ కి హాజరు పెడతామని తెలిపారు.