వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణానదీ పరివాహక ప్రాంతావాసుల వరద ముంపు సమస్యను తెలుసుకొని చలించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.125 కోట్ల మంజూరు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు వైసీపీ నాయకులూ దేవినేని అవినాష్.
ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేయడంతోపాటు ఎలాంటి నాణ్యత లోపం లేకుండా నిర్మాణం పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపి ప్రజల కష్టాలను తొలగించిన సీఎం జగన్ కి మా తూర్పు నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆనందాన్ని వ్యక్తపరిచారు.