కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు విద్యను దూరం చేయాలని చూస్తే సహించేది లేదని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్, జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్. ఓబుల్ రెడ్డి హెచ్చరించారు. బద్వేల్ లోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద జాతీయ పతాకాన్ని జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్. ఓబుల్ రెడ్డిలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందరిలో స్ఫూర్తి నింపడం కోసం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్. శశిధర్ కుమార్, బద్వేలు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి. శివప్రసాద్, బి. వి. శ్రీనివాసులరెడ్డి, ట్రెజరర్ గురయ్య, గోపవరం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరదాసరి క్రిస్టఫర్, సి. కంచిరెడ్డి, ట్రెజరర్ ఎం. రామచంద్రయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్. మస్తాన్ వల్లి తదితరులు పాల్గొన్నారు.