చిత్తూరు: ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి పేర్కొన్నారు. శుక్రవారం సమావేశపు మందిరంలో జిల్లా అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి కె. వి. ఉషశ్రీ చరణ్ అధ్యక్షతన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.