చిత్తూరు: జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ సంబంధిత శాఖల ద్వారా అమలవుతున్న పథకాల అమలు తీరుపై మరియు జిల్లా అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై సమీక్షించామని ఇన్చార్జ్ మంత్రి ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా ముందజలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం పేదలందరికీ ఇళ్లు కార్యక్రమ అమలులో మెరుగైన స్థానంలో ఉన్నామన్నారు.