ముదిగుబ్బ: ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలోని సచివాలయం-2 నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ డీఈ లోకన్న కాంట్రాక్టర్ కి సూచించారు. శుక్రవారం ఆయన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దన్నారు. అనంతరం బిల్లులపై కాంట్రాక్టర్ తో చర్చించారు. ఆయన వెంట పీఆర్ జేఈ రవీంద్ర చండ్రాయుడు ఉన్నారు.