కొడుకుతో కలిసి బైక్ ల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఢిల్లీలోని సుల్తాన్ పురి పోలీసులు రిషబ్ అనే 20 ఏళ్ల వ్యక్తిని, అతడి సవతి తల్లి(32) దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 బైక్ లు, 2 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై మొత్తం 23 కేసులు నమోదైనట్లు అందులో పేర్కొన్నారు.