దళిత, ఆదివాసీల సంక్షేమ పథకాలును పునరుద్ధరణ చేయాలని, దళిత మంత్రులు ప్రజాప్రతినిధులు నోరువిప్పాలని సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మందస మండలం హరిపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కాలంలో దళితులు గుర్తురాకపోవడం చాలా అన్యాయంగా ఉందని, అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటానని చెప్పి, దళితులు జీవనాడిగా ఉన్న యస్ సి కార్పొరేషన్, ఇతర సంక్షేమ పధకాలు ఒక్క పైసా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. రద్దు చేసిన సంక్షేమ పథకాలు తక్షణమే పునరుద్ధరణ చేయకపోతే తగినమూల్యం చెల్లించక తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిత్రి లక్ష్మణరావు, ఇప్పిలి తాతారావు, కల్యాణి కూరవయ్య, బలగ నారాయణరావు, బదకళ కూర్మరావు, బుసకల పరమేశ్వరరావు, తలగాన చంద్రశేఖర్, రాకెట్ల వాసు, తెప్ప డిల్లిరావు, తెప్ప లోయిదాసు, తెప్ప పాపారావు, తెప్ప కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.