విజయనగరం జిల్లాలో దేశపాత్రుని పాలెం, గజపతినగరం, విజయనగరం, కోమటిపల్లిలో గల ఆలయాల్లో ఇటీవల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ. 8. 5 లక్షలు విలువైన 13. 050 కిలోల వెండి, బంగారు ఆభరణాలు, ఒక మోటారు సైకిలును నిందితుల వద్ద నుండి రికవరీ చేసినట్లు ఇన్ ఛార్జ్ డిఎస్పీ శ్రీ ఆర్. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితులు విశాఖపట్నం సిటీ, పశ్చిమ గోదావరి జిల్లా మరియు తెలంగాణలో కూడా ఈ తరహా నేరాలకు పాల్పడ్డారన్నారు. నిందితులను అరెస్టు చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక, అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa