ఓ కారు అతి వేగంగా దూసుకెళ్లి ఆటో, బైక్‌ను ఢీకొట్టగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ ఆనంద్ జిల్లాలో గురువారం జరిగింది. ఆటోలో ఉన్న నలుగురు, బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. కాగా, డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. చికిత్స కోసమని ఓ ఆస్పత్రిలో చేరాడు.రంగంలోకి దిగిన పోలీసులు గుజరాత్‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడైన కేతన్ కారును వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa