రాజస్థాన్ జలోర్ జిల్లా సురానా గ్రామంలో దారుణం జరిగింది. కుండలో నీళ్లు తాగాడని 9 ఏళ్ల దళిత బాలుడిని టీచర్ చైల్ సింగ్ (40) జూలై 20న దారుణంగా కొట్టాడు. తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన బాధిత బాలుడు శనివారం మృతి చెందాడు. దీనిపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఘటన బాధాకరమన్నారు. హత్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని, నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.