కర్ణాటక హోలె నరసిపురలో శనివారం దారుణం జరిగింది. చైత్ర (28), శివకుమార్ (32) అనే దంపతుల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఫ్యామిలీ కోర్టు నిర్వహించారు. కౌన్సెలింగ్ తర్వాత వాష్‌రూమ్‌లో చైత్ర మెడను ఆమె భర్త శివకుమార్ కత్తితో కోశాడు. చైత్రను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారని ఎస్పీ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ట్లు తెలిపారు.