మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ అనుబంధం ఎపి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పార్వతీ ప్రసాద్, పద్మావతిలు విమర్శించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో ఆదివారం మహిళా సమాఖ్య నగర సమితి సమావేశం నిర్వహించారు. సమాఖ్య నగర అధ్యక్షురాలు జానకి అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు.