కడప కో ఆపరేటివ్ కాలనీకి చెందిన బాలాజీ (45) కి 12 ఏళ్ల కిందట వివాహమైంది. పిల్లలు పుట్టలేదు. దీంతో మనస్తాపానికి గురయ్యారు. ఇటీవల అతని సోదరుడు వెంకటయ్య కూడా మృతి చెందాడు. జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.