భారతదేశంలో అశాంతికి ఆద్యుడు, భారతీయ స్త్రీల మాన ప్రాణాలు దోచుకున్న దుర్మార్గుడు,లక్షలాదిమంది హిందువులను అత్యంత కిరాతక చావులతో భారతీయుల స్వేచ్ఛ , స్వాతంత్ర్యాలను మంటకలిపిన నరరూప రాక్షసుడి పేరుతో పిలువబడుతున్న "జిన్నా" టవర్ పై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలా? అని బీజేపీ రాష్ట్ర నాయకులూ సోము వీర్రాజు ప్రశ్నించారు.
ఇదేనా మీరు కోట్లు ఖర్చు చేసి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రదర్శించే దేశభక్తి? జగన్ తక్షణమే దేశ ద్రోహి "జిన్నా" టవర్ పై వేడుకలు, ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఊహించని పరిస్థితులను చవిచూడక తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి ఆంధ్రప్రదేశ్ శాఖ హెచ్చరిస్తుంది అని తెలియజేసారు.