అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నాగేంద్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన& పోరాడిన త్యాగధనులను అదనపు ఎస్పీ ఈసందర్భంగా గుర్తు చేశారు.నివాళులు అర్పించి వారి త్యాగాలను వివరించారు.అమరుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు.