చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీల తోకలు కట్ చేస్తానని హేళన చేశారని, ఇప్పటికీ మారని ఆయన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేని స్థితిలో ఉన్నారని చెప్పారు.
మంత్రి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బీసీ వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తే బడుగు, బలహీన వర్గాలపై ఆ పార్టీ ఎంత ద్వేషంతో ఉందో అర్థమవుతుందని చెప్పారు. యూకే నుంచి తెప్పించిన మార్ఫింగ్ చేసిన వీడియోతో టీడీపీ నాయకుల దుష్ప్రచారం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో మహిళలు, బడుగు బలహీన వర్గాల పట్ల టీడీపీ వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందన్నారు.