తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి పట్టణంలోని ముక్కంటీశ్వరుడిని మధురై హైకోర్టు న్యాయమూర్తి ధరణి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆలయ అధికారులు వేద ఆశీర్వచనాలు పలికారు. అనంతరం స్వామివారి ప్రసాదాలతో పాటు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.